Andhra Pradesh: ఏపీ కాంగ్రెస్ కు కొత్త చీఫ్ నియామకం!

  • ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శైలాజానాథ్ నియామకం
  • వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తులసిరెడ్డి, మస్తాన్ వలీ
  • రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కనుమరుగైన కాంగ్రెస్

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోవడం తెలిసిందే. ఇప్పటివరకు రెండు పర్యాయాలు ఎన్నికలు జరిగినా ఒక్క స్థానంలోనూ ఉనికి చాటుకోలేకపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో పార్టీకి కొత్త జవసత్వాలు అందించడానికి అధిష్ఠానం చర్యలు తీసుకుంది.

ఈ క్రమంలో ఏపీ పీసీసీకి కొత్త అధ్యక్షుడిగా సాకే శైలజానాథ్ ను నియమించారు. ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన సీనియర్ నేత రఘువీరారెడ్డి స్థానంలో శైలజానాథ్ బాధ్యతలు అందుకుంటారు. ఇక, రాష్ట్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తులసిరెడ్డి, షేక్ మస్తాన్ వలీని నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు.

Andhra Pradesh
Congress
AP PCC
Saake Sailajanath
Tulasireddy
Mastan Vali
Working President
  • Loading...

More Telugu News