Facebook: ఫేస్ బుక్ మెసెంజర్ ను వెనక్కినెట్టిన టిక్ టాక్

  • దూసుకెళుతున్న చైనీస్ యాప్
  • 700 మిలియన్ డౌన్ లోడ్లతో రెండో స్థానం
  • టాప్ ప్లేసులో వాట్సాప్

చైనీస్ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ ఎంత వేగంగా ప్రజాదరణ పొందిందో తెలిసిందే. సెలబ్రిటీల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు టిక్ టాక్ ఫేవరెట్ యాప్ గా మారింది. ఈ సోషల్ మీడియా యాప్ తాజాగా ఫేస్ బుక్ మెసెంజర్ ను వెనక్కినెట్టింది. సెన్సర్ టవర్ అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ 700 మిలియన్ల డౌన్ లోడ్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు రెండోస్థానంలో ఉన్న ఫేస్ బుక్ మెసెంజర్... టిక్ టాక్ ప్రభంజనంతో డీలాపడింది. కాగా, ఈ జాబితాలో ఫేస్ బుక్ కు చెందిన వాట్సాప్ అగ్రస్థానంలో ఉంది. వాట్సాప్ 850 మిలియన్ డౌన్ లోడ్లతో నెంబర్ వన్ గా కొనసాగుతోంది.

Facebook
Messenger
Tik Tok
Social Media
Whatsapp
  • Loading...

More Telugu News