BJP: రాష్ట్రంలో సామాజిక న్యాయం బీజేపీ-జనసేనతోనే సాధ్యం: కన్నా

  • విజయవాడలో బీజేపీ, జనసేన సమావేశం
  • హాజరైన అగ్రనేతలు
  • మీడియాతో మాట్లాడిన కన్నా

ఏపీలో కొత్త రాజకీయ సమీకరణానికి తెరలేచింది. కలిసి పనిచేయాలని బీజేపీ, జనసేన నిర్ణయించాయి. విజయవాడలో ఈ రెండు పార్టీల అగ్రనేతల సమావేశం ముగిసింది. అనంతరం ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, జనసేనాని పవన్ కల్యాణ్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ, తమతో కలిసి పనిచేసేందుకు జనసేన ముందుకు వచ్చిందని తెలిపారు. ఏపీలో సామాజిక న్యాయం బీజేపీ-జనసేనతోనే సాధ్యమని బలంగా నమ్ముతున్నామని కన్నా స్పష్టం చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వ అవినీతిపైనా, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పాలనపైనా కలిసి పోరాటం సాగిస్తామని వెల్లడించారు. ప్రజావ్యతిరేక విధానం ఏదైనా బీజేపీ, జనసేన సంయుక్తంగా ఉద్యమిస్తాయని పేర్కొన్నారు.

కాగా, బీజేపీ, జనసేన సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతం నుంచి రాజధాని తరలింపును వ్యతిరేకించాలన్న అంశాలపై రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు సమాచారం.

BJP
Janasena
Andhra Pradesh
Amaravati
YSRCP
Jagan
Vizag
AP Capital
  • Loading...

More Telugu News