Five rupees note: 786 నంబరు సీరీస్ ఐదు రూపాయల నోటు ఉంటే మీ పంట పండినట్టే!

  • ఆన్‌లైన్‌లో  లక్షలు చెల్లించే అవకాశం
  • పాతవస్తువులు సేకరించే వారి ఉబలాటం
  • ఈబై, ఇండియన్‌ ఓల్డ్‌కాయిన్‌ వెబ్‌సైట్లలో వేలం

ఒక్క ఐదు రూపాయల నోటుంటే...మీరు లక్షాధికారి అయ్యే అవకాశం మీ చెంత ఉన్నట్టే. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? పాత వస్తువులు సేకరించే అలవాటున్న వారు ప్రస్తుతం ట్రాక్టర్‌ బొమ్మతోపాటు 786 సీరీస్‌ నంబర్‌ నోటు కోసం లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. పాతనోట్లు, నాణాలకు ఈబై, ఇండియన్‌ ఓల్డ్‌కాయిన్‌ వెబ్‌సైట్లలో ఆన్ లైన్ వేలం నిర్వహిస్తూ ఉంటారు. ఈ సైట్లలో గతంలో కొన్ని నాణాలకు కోట్ల రూపాయలు పలికిన సందర్భాలు ఉన్నాయి.

2018లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం కొన్ని ఈ కామర్స్ వెబ్‌సైట్లు పురాతన నాణాల వేలం నిర్వహించగా కోట్ల రూపాయలు పలికాయి. 1740కి సంబంధించిన ఒక నాణెం విలువ రూ. 3 కోట్లు పలికింది. అదేవిధంగా 400 ఏళ్ల పురాతన వెండి నాణెం (శివుని చిత్రం కలిగినది) వేలంలో రూ. 3.5 లక్షలు పలికింది.

అందువల్ల అరుదైన నాణాలు, నోట్లు ఉంటే మీరూ అదృష్ణాన్ని పరీక్షించుకోవచ్చు. మీ వద్ద ఉన్న నాణెం లేదా నోటును ఫొటో తీసి ఈ వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాలి. ఆ తర్వాత వేలం మొదలవుతుంది. కానీ కొన్ని ఫేక్‌ వెబ్‌ సైట్లుంటాయి. సైబర్‌ నేరగాళ్లు వల వేసే ప్రమాదం ఉంది.

అందువల్ల వెబ్‌సైట్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే నాణెం, నోటు కొంటామని ఫోన్లు వచ్చినా ఎంతో నమ్మకం కుదిరాక, అటు వైపు వ్యక్తి నిజంగా కొనే వ్యక్తి అన్న నమ్మకం కలిగాకే అమ్మకానికి ఉంచాలి. లేదంటే మోసపోయే ప్రమాదం ఉంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News