uber: ఉబెర్ క్యాబ్ డ్రైవర్ ప్రవర్తనతో భయంతో వణికిపోయాను: సోనమ్‌ కపూర్‌

  • ప్రస్తుతం లండన్‌లో ఉన్న సోనమ్ 
  • భయానక అనుభవం ఎదురైందని ట్వీట్ 
  • ఓ విషయంపై డ్రైవర్‌ తనపై విపరీతంగా అరిచాడని వ్యాఖ్య 

బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌ సోనమ్‌ కపూర్‌కు లండన్‌లో ఉబెర్ క్యాబ్‌లో ప్రయాణిస్తుండగా భయానక అనుభవం ఎదురైందట. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌లో తెలిపారు. ఓ విషయంపై డ్రైవర్‌ తనపై విపరీతంగా అరిచాడని, దీంతో తాను ఆ క్యాబ్‌ దిగిపోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.

'లండన్‌లో నేను ఉబెర్‌ క్యాబ్‌లో ప్రయాణిస్తున్నపుడు భయంకరమైన అనుభవం ఎదురయింది. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రజా రవాణా వ్యవస్థకు చెందిన వాహనాల్లో మాత్రమే ప్రయాణం చేయడమే మంచిది. నేను క్యాబ్‌లో వణికిపోయాను' అని సోనమ్ కపూర్ ట్వీట్ చేసింది.

ఇటీవలే సోనమ్‌ కపూర్‌ బ్రిటీష్‌ ఎయిర్‌వేస్ నిర్లక్ష్యంపై కూడా పలు ఆరోపణలు చేసింది. బ్యాగేజీని తిరిగి అందజేయడంలో ఎయిర్‌వేస్‌ సంస్థ సిబ్బంది తీరు బాగోలేదని ఆమె అన్నారు. రెండు సార్లు తన బ్యాగ్‌ను పోగొట్టారని తెలిపింది.

uber
London
Bollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News