Pawan Kalyan: బీజేపీ, జనసేనల భేటీ.. హాజరైన పురందేశ్వరి, సోము వీర్రాజు

  • విజయవాడలో ప్రారంభమైన సమావేశం
  • ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై చర్చ
  • మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం

బీజేపీ, జనసేనల మధ్య అత్యంత కీలకమైన సమావేశం ప్రారంభమైంది. విజయవాడలోని ఫార్చ్యూన్ మురళి హోటల్ లో ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశానికి బీజేపీ తరపున కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి, సునీల్ దేవధర్, సోము వీర్రాజు హాజరుకాగా... జనసేన తరపున పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.

ప్రజా సమస్యలు, భవిష్యత్ ఉమ్మడి కార్యాచరణ, అమరావతి అంశాలపై వీరు లోతుగా చర్చిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇరు పార్టీల నేతలు కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. మరోవైపు బీజేపీ, జనసేనలు చేతులు కలపడంపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయో అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.

Pawan Kalyan
Purandheswari
GVL Narasimha Rao
Kanna Lakshminarayana
Somu Veerraju
Nadendla Manohar
Janasena
  • Loading...

More Telugu News