Sankranti: సంక్రాంతి సంబరాల్లో పాల్గొని.. పతంగులు ఎగరవేసిన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్.. ఫొటోలు ఇవిగో

  • భారత పర్యటనలో జెఫ్ బెజోస్ 
  • చిన్నారులతో కలిసి సంక్రాంతి 
  • తన బాల్యం గుర్తుకొచ్చిందని వ్యాఖ్య

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్ బెజోస్ భారత పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఢిల్లీలో చిన్నారులతో కలిసి పతంగులు ఎగరవేశారు. చిన్నారులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.
       ఇలా పతంగులు ఎగురవేస్తోంటే చాలా కాలం తర్వాత తనకు బాల్యం గుర్తుకు వచ్చిందని తెలిపారు. తన బాల్యంలో ఇలాగే పతంగులు ఎగరవేశానని అన్నారు.  భారత సంప్రదాయ దుస్తులు ధరించి మరీ ఆయన ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. ఢిల్లీలో ఆయన పర్యటన సందర్భంగా పలువురు ఆయనతో ఫొటోలు దిగారు.                     

Sankranti
amazon
New Delhi
  • Loading...

More Telugu News