USA: అమెరికా తరహాలో వ్యవహరిస్తేనే ఫలితం దక్కుతుంది: బిపిన్ రావత్

  • ఉగ్రవాదులకు కొన్ని దేశాలు సహకరిస్తున్నాయి
  • ఆయుధాలు, నిధులను సమకూరుస్తున్నాయి
  • అలాంటి దేశాలను టార్గెట్ చేయాలి

టెర్రరిస్టులకు కొన్ని దేశాలు సహాయసహకారాలు అందిస్తున్నాయని.. ఇది కొనసాగినంత కాలం ఉగ్ర భూతాన్ని అంతం చేయలేమని డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులకు ఆయుధాలు, నిధులను సమకూరుస్తున్నంత కాలం టెర్రరిజాన్ని అంతం చేయలేమని చెప్పారు. 9/11 దాడుల తర్వాత టెర్రరిస్టులపై అమెరికా ఉక్కుపాదం మోపిన విధంగా వ్యవహరిస్తే తప్ప టెర్రరిజాన్ని నియంత్రించలేమని తెలిపారు.

టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా అమెరికా యుద్ధం చేస్తోందని జనరల్ రావత్ చెప్పారు. ఉగ్రవాదులను అంతం చేయాలంటే వారిని ఏకాకులను చేయాలని... వారికి సహకరిస్తున్న దేశాలను టార్గెట్ చేయాలని అన్నారు. టెర్రరిస్టులకు సహకరిస్తున్న దేశాలను ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) బ్లాక్ లిస్టులో పెడుతుండటం మంచి పరిణామమని చెప్పారు. ఇలాంటి చర్యలతో ఉగ్రవాదులకు సహకరిస్తున్న దేశాలను ఏకాకి చేయవచ్చని తెలిపారు.

USA
India
CDS
Bipin Rawat
  • Loading...

More Telugu News