Crime News: గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎం కొల్లగొట్టే యత్నం...డబ్బు చిక్కక ఈసురోమన్న దొంగలు!

  • సీసీ కెమెరాలు కప్పేసి మరీ దొంగతనం యత్నం
  • ఏటీఎం దెబ్బతిన్నా తెరుచుకోని నగదు బాక్స్‌లు
  • మంటలు చెలరేగడంతో పారిపోయిన దొంగలు

ఏటీఎం బాక్స్‌లో నగదు దొంగిలించేందుకు తీవ్ర ప్రయత్నం చేసిన దొంగలు ఎంత ప్రయత్నించినా అధి సాధ్యం కాకపోవడంతో చివరికి తోకముడిచి పారిపోయారు. అనంతపురం జిల్లా పెనుకొండ కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలావున్నాయి.

పట్టణంలో ఏక్సిస్‌ బ్యాంకు ఏటీఎం ఉంది. ఈరోజు తెల్లవారు జామున 3.21 గంటల సమయంలో ముఖానికి ముసుగు వేసుకున్న ఓ దొంగ ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించాడు. అనంతరం ఏటీఎం పైకి ఎక్కి సీసీ కెమెరాను గుడ్డతో కప్పేశాడు.

అనంతరం ఏటీఎంను తెరిచేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం గ్యాస్‌ కట్టర్‌ కూడా ఉపయోగించారు. ఈ ప్రయత్నంలో ఏటీఎం ధ్వంసమైనా నగదు ఉన్న బాక్స్‌లు ఓపెన్‌ కాలేదు. పైగా గ్యాస్‌ కట్టర్‌ ఉపయోగించడం వల్ల ఏటీఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీంతో భయాందోళనలకు గురైన దొంగలు ఎక్కడివక్కడ వదిలేసి పారిపోయారు. ఉదయం పరిస్థితి చూసి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Crime News
Anantapur District
ATM robery
  • Loading...

More Telugu News