Pawan Kalyan: పవన్ కల్యాణ్ తో జరిగే భేటీలో ఈ అంశాలపై చర్చిస్తాం: జీవీఎల్

  • కాసేపట్లో జనసేన, బీజేపీ భేటీ
  • జనసేన తరపున హాజరుకానున్న పవన్, నాదెండ్ల
  • నాలుగేళ్ల కార్యాచరణపై చర్చిస్తామన్న జీవీఎల్

ఏపీలో రాజకీయ వాతావరణం మారిపోయింది. కొత్త సమీకరణలు తెరపైకి వచ్చాయి. జనసేన, బీజేపీలు కలసికట్టుగా ముందుకు సాగనున్నాయి. కాసేపట్లో ఇరు పార్టీల మధ్య కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీకి బీజేపీ నుంచి రాష్ట్ర చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దేవధర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు హాజరుకానున్నారు. జనసేన తరపున ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, కీలక నేత నాదెండ్ల మనోహర్ హాజరుకాబోతున్నారు.

మరోవైపు ఈ భేటీ నేపథ్యంలో కొందరు బీజేపీ కీలక నేతలు సమావేశమై... భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, రానున్న నాలుగేళ్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇరుపార్టీల భేటీలో చర్చిస్తామని తెలిపారు. కేవలం అమరావతి, స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే తమ సమావేశ అజెండా కాదని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వ్యూహాలపై చర్చిస్తామని తెలిపారు.

Pawan Kalyan
Janasena
GVL Narasimha Rao
Kanna Lakshminarayana
BJP
  • Loading...

More Telugu News