LTT Express: బ్రేకింగ్... పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్ ప్రెస్!

  • ఒడిశాలోని నిర్గుండి వద్ద ప్రమాదం
  • 50 మందికి పైగా గాయాలు
  • కొనసాగుతున్న సహాయక చర్యలు

ముంబయి నుంచి భువనేశ్వర్ వెళుతున్న ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ కొద్దిసేపటి క్రితం పట్టాలు తప్పింది. ఒడిశాలోని నిర్గుండి వద్ద 6 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, 50 మందికి పైగా గాయపడగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని కటక్ లోని ఆసుపత్రులకు తరలించారు. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ప్రయాణికులను భువనేశ్వర్ చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. రైలు ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

LTT Express
Derail
Katak
Bhuvaneshwar
  • Loading...

More Telugu News