Ala Vaikunthapuramulo: నిన్నటి మ్యాట్నీషోతో రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'అల వైకుంఠపురములో..'

  • మరో రికార్డును సొంతం చేసుకున్న బన్నీ
  • నూరు శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న 'అల వైకుంఠపురములో..'
  • మరో రెండు రోజుల్లో ఇంటర్నేషనల్ బ్రేక్ ఈవెన్

సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన అల్లు అర్జున్ తాజా చిత్రం 'అల వైకుంఠపురములో..' మరో రికార్డును క్రియేట్ చేసింది. బుధవారం మధ్యాహ్నం మ్యాట్నీ షోతో ఈ చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

 ఈ చిత్రం 12వ తేదీన విడుదల కాగా, తొలి మూడు రోజుల్లో 90 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దర్బార్, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో పోటీ పడుతూ, ఇప్పటికీ నూరు శాతం ఆక్యుపెన్సీతో చిత్రం నడుస్తోందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇక సినిమా థియేట్రికల్ (గ్లోబల్) హక్కులను రూ. 85 కోట్లకు విక్రయించగా, ఇప్పటివరకూ రూ. 60 కోట్లకు పైగానే షేర్ వచ్చిందని, మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందని సమాచారం.

Ala Vaikunthapuramulo
Matney
100 Crores
Collections
  • Loading...

More Telugu News