Mahesh Babu: బ్లాక్ బస్టర్ కు 'అబ్బ' లాంటి సినిమాను మహేశ్ బాబు ఇచ్చారు: అనిల్ రావిపూడి కుటుంబ సభ్యులు

  • సంక్రాంతి సందర్భంగా రిలీజైన సరిలేరు నీకెవ్వరు చిత్రం  
  • బాక్సాఫీసు వద్ద ఘనవిజయం
  • వీడియో సందేశం వెలువరించిన అనిల్ రావిపూడి ఫ్యామిలీ మెంబర్స్

సరిలేరు నీకెవ్వరు చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో హీరో మహేశ్ బాబుకు ఊహించని వ్యక్తుల నుంచి శుభాభినందనలు లభించాయి. దర్శకుడు అనిల్ రావిపూడి కుటుంబ సభ్యులు ఓ వీడియో రూపంలో మహేశ్ బాబుపై పొగడ్తల జల్లు కురిపించారు. మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ కు అబ్బ లాంటి సినిమా ఇచ్చారని కొనియాడారు. అంతేకాకుండా, మహేశ్ బాబు గత చిత్రాల్లో ఎప్పుడూ చేయని విధంగా డ్యాన్సులు అద్భుతంగా చేశాడని కితాబిచ్చారు. ఈ వీడియోను మహేశ్ బాబు అర్ధాంగి నమ్రత సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Mahesh Babu
Anil Ravipudi
SarileruNeekevvaru
Tollywood
Family Members
Namrata
  • Loading...

More Telugu News