Andhra Pradesh: అమరావతి ఉద్యమం ప్రజల నుంచి వచ్చింది కాదు: అవంతి

  • శ్రీశైలం వెళ్లిన మంత్రి అవంతి
  • అమరావతి ఉద్యమాన్ని సృష్టించారని ఆరోపణ
  • టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీచేయాలని సవాల్

అమరావతి ఉద్యమం ప్రజల నుంచి వచ్చింది కాదని, స్వార్థ ప్రయోజనాలతో కృత్రిమంగా సృష్టించారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. విశాఖలో రాజధాని వద్దంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే చంద్రబాబు వాదనే సరైందని తాము అంగీకరిస్తామని చెప్పారు.

 అమరావతిపై ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్న పవన్ కల్యాణ్ ఎన్నికల్లో గాజువాక నుంచి ఎందుకు పోటీచేశారని అవంతి ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే వైసీపీ ప్రభుత్వ పంథా అని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల ప్రజలతో పోల్చితే గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకున్నవాళ్లని అభిప్రాయపడ్డారు. సంక్రాంతి సందర్భంగా శ్రీశైలం వెళ్లిన మంత్రి అవంతి దైవదర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh
Amaravati
YSRCP
Avanthi Srinivas
Telugudesam
Vizag
  • Loading...

More Telugu News