Virat Kohli: విరాట్ కోహ్లీకి ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు

  • 2019కి గాను కోహ్లీకి విశిష్ట పురస్కారం
  • ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్ ను దూషిస్తున్న ప్రేక్షకులు
  • ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేసిన కోహ్లీ

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అవార్డు చేరింది. 2019 సంవత్సరానికి గాను ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును కోహ్లీ దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా స్టీవ్ స్మిత్ ను దూషించవద్దు, ప్రోత్సహించండి అంటూ అభిమానులకు కోహ్లీ విజ్ఞప్తి చేయడాన్ని ఐసీసీ స్ఫూర్తిదాయక చర్యగా పరిగణించింది.

 బాల్ టాంపరింగ్ ఉదంతంలో ఏడాది నిషేధాన్ని పూర్తిచేసుకున్న స్మిత్ ను పలు మ్యాచ్ ల్లో 'చీటర్' అంటూ అభిమానులు అవహేళన చేశారు. అయితే భారత్ తో మ్యాచ్ సందర్భంగా అప్పటివరకు హేళన చేస్తున్న వారు కాస్తా కోహ్లీ విజ్ఞప్తి చేయగానే తమ వైఖరి మార్చుకోవడం ఐసీసీని విశేషంగా ఆకట్టుకుంది. అందుకే కోహ్లీకి ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు ప్రకటించింది.

Virat Kohli
ICC Spirit Of Cricket
Steve Smith
India
Australia
Wold Cup
England
  • Error fetching data: Network response was not ok

More Telugu News