Chiranjeevi: అకీరా సహా మెగా హీరోలందరూ ఒక్కచోట చేరితే ఇలా ఉంటుంది!

  • మెగా ఇంట సంక్రాంతి సంబరాలు  
  • ఆనందోత్సాహాల నడుమ వేడుక  
  • ఒకే ఫ్రేమ్ లో మెగా హీరోలు  
  •  అభిమానులకు కనువిందు

సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో కొత్త కాంతులు తీసుకువస్తుంది. భోగి పండుగ నుంచి కనుమ వరకు ఆ సందోహం అంతాఇంతా కాదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సంక్రాంతి సంబరాలు జరుపుకోనివారంటూ ఉండరు. ఇప్పుడు మెగా ఇంట కూడా సంక్రాంతి శోభ వెల్లివిరిసింది.

మెగాస్టార్ చిరంజీవి సహా మెగా హీరోలందరూ ఒక్కచోట చేరి వేడుకలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన సందడి చేస్తోంది. ఇందులో చిరంజీవి సంప్రదాయ దుస్తులు ధరించి కనిపించారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, కల్యాణ్ దేవ్ ఉన్నారు. పవన్ కల్యాణ్ తనయుడు అకీరా కూడా తన సీనియర్ కుటుంబసభ్యులతో ఫొటోలో దర్శనమిచ్చాడు. మొత్తం మీద మెగా హీరోలందరినీ ఇలా ఒకే ఫ్రేమ్ లో చూడడం అభిమానులకు కనులవిందేనని చెప్పాలి.

Chiranjeevi
Pawan Kalyan
Akira
Ramcharan
Allu Arjun
Allu Shirish
Saidharam Tej
Varun Tej
Kalyan Dev
  • Loading...

More Telugu News