cock fight: కృష్ణా జిల్లాలో సై అంటే సై అంటున్న కోళ్లు.. పందాల జోరు!

  • రెండో రోజూ ఢీ అంటే ఢీ అన్న కోళ్లు
  • శిబిరాలు వేసి మరీ నిర్వహణ
  • పందెం రాయుళ్లతోపాటు భారీగా సందర్శకులు

కోళ్లు కాళ్లు దువ్వుతున్నాయి. నువ్వా? నేనా? అన్నట్టు తలపడుతున్నాయి. పందెం రాయుళ్ల ఉలికింపులతో కిక్‌ ఎక్కుతోంది. సందర్శకుల కేకలతో శిబిరాలు హోరెత్తుతున్నాయి. కృష్ణా జిల్లాలో ఢీ అంటే ఢీ అన్నట్లు కోడిపందాలు సాగుతున్నాయి.

నిన్న ప్రారంభమైన పోటీలు రెండోరోజు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ నాయకుడు యార్లగడ్డ వెంకటరావు అనుచరులు పోటాపోటీగా శిబిరాలు ఏర్పాటుచేసి పందాలు నిర్వహిస్తున్నారు. నూజివీడు, కైకలూరు, గుడివాడ, పామర్రు, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్దఎత్తున కోడి పందాల శిబిరాలను ఏర్పాటు చేశారు. పందెపురాయుళ్లతో పాటు భారీగా సందర్శకులు శిబిరాలకు తరలివస్తుండడం విశేషం.

cock fight
Krishna District
  • Loading...

More Telugu News