Pooja Hegde: రోహన్ మెహ్రాతో పీకల్లోతు ప్రేమలో ఉన్న పూజ హెగ్డే!

  • సీనియర్ నటుడు వినోద్ కుమారుడు రోహన్
  • గత కొంతకాలంగా పూజ హెగ్డేతో డేటింగ్
  • అధికారికంగా నోరు విప్పని జంట

గత సంవత్సరం హిందీలో వచ్చిన 'బజార్' చిత్రంతో పాప్యులర్ అయిన సీనియర్ స్టార్ వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ వినోద్ మెహ్రాతో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ప్రేమలో పడిందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. తెలుగులో ముకుంద, డీజే, అరవింద సమేత, మహర్షి, వాల్మీకి చిత్రాలతో ఇప్పటికే టాప్ హీరోయిన్ గా ఉన్న ఈ అందాల భామ తాజాగా గత వారం విడుదలైన అల వైకుంఠ‌పుర‌ములో న‌టించి త‌న గ్లామ‌ర్‌ తో సినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది.

త్వరలోనే ప్రభాస్ తో మరో సినిమాలో కనిపించనున్న ఈ అమ్మడు, ఇప్పుడు రోహన్ మెహ్రాతో డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇక ఈ విషయంలో నిజమెంత? అన్న విషయం వారిద్దరిలో ఎవరో ఒకరు నోరు మెదిపితేనే తెలుస్తుంది.

Pooja Hegde
Vinod Mehra
Rohan
Dating
Love
  • Loading...

More Telugu News