Crime News: కూతురిపై తండ్రి లైంగికదాడి... మైనర్ బాలికపై అఘాయిత్యం

  • హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న విద్యార్థిని 
  • సంక్రాంతి సెలవులకు  రాక 
  • నాన్నమ్మతో ఉండగానే ఘోరం

జన్మనిచ్చిన కన్న తండ్రులే కొందరు తమ పిల్లలపై మృగత్వాన్ని చాటుకుంటున్నారు. తల్లిలేని బిడ్డను అల్లారు ముద్దుగా పెంచి పెద్దచేసి ఓ అయ్య చేతిలో పెట్టాల్సిన బాధ్యతాయుత స్థానంలో ఉన్న తండ్రే కూతురిపై కన్నేసి లైంగిక దాడికి పాల్పడితే ఆ బిడ్డ ఎవరికి చెప్పుకుంటుంది? సభ్యసమాజమే తలదించుకునే ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని ఓ శివారు గ్రామంలో వెలుగు చూసింది.

పోలీసుల కథనం మేరకు...గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి బాలిక తల్లి కొన్నాళ్ల క్రితం చనిపోయింది. హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న బాలిక సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చింది. ఇంట్లో తండ్రి, నాయనమ్మ ఉన్నారు. కూతురిపై ఎప్పటి నుంచో కన్నేసిన తండ్రి ఆదివారం రాత్రి నాయనమ్మ పక్కన పడుకున్న బాలికను ఎత్తుకు వెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అదేవిధంగా సోమవారం రాత్రి కూడా మరోసారి ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. దీంతో భయంతో బాలిక పక్కింటికి పారిపోయింది. విషయం తెలుసుకున్న తండ్రి అక్కడికి వెళ్లి కుమార్తెను పంపమని పక్కింటి వారిని అడిగాడు. ఈ సందర్భంగా వారితో వాగ్వాదానికి దిగాడు.

బాలికకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన స్థానికులు 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రాయవరం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని నిన్న విచారించిన పోలీసులు పోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు. బాలికను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Crime News
East Godavari District
rayavaram mandal
rapecase
  • Loading...

More Telugu News