Devindar singh: ఉగ్రవాదులకు సాయం చేస్తూ చిక్కిన డీఎస్పీ.. పతకం వార్త అవాస్తవమన్న పోలీసులు!

  • ఉగ్రవాదులను  తన కారులో తీసుకెళ్తూ చిక్కిన డీఎస్పీ
  • గ్యాలెంటరీ అవార్డు అందుకున్నట్టు మీడియాలో కథనాలు
  • అవాస్తవమన్న జమ్మూకశ్మీర్ పోలీసులు

జమ్మూకశ్మీర్‌కు చెందిన డీఎస్పీ దేవీందర్‌సింగ్ గత శనివారం ఉగ్రవాదులకు సాయం చేస్తూ పోలీసులకు చిక్కాడు. హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను తన కారులో తీసుకుని వెళ్తుండగా పట్టుబడ్డాడు. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు దేవీందర్‌సింగ్ కేంద్ర హోంశాఖ నుంచి అత్యున్నత పతకం అందుకున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా, ఈ వార్తలను జమ్మూకశ్మీర్ పోలీసులు కొట్టిపడేశారు.

దేవీందర్ పోలీసు పతకం అందుకున్నట్టు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. 2018లో అప్పటి జమ్మూకశ్మీర్ రాష్ట్ర పోలీసు విభాగం ఇచ్చిన ఒకే ఒక్క పతకాన్ని దేవీందర్ అందుకున్నాడని, అది తప్ప మరోటి లేదని వివరణ ఇచ్చారు. అతడి పేరుతో ఉన్న మరో అధికారి కేంద్ర పతకం అందుకున్నాడని పేర్కొన్నారు. కాగా, దేవీందర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆయన నివాసంలో జరిపిన సోదాల్లో రెండు పిస్తోళ్లు, ఏకే 47 రైఫిల్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News