Nalgonda District: పొలంలో నీళ్లు తాగేందుకు వచ్చి వలలో చిక్కిన చిరుతపులి.. జూపార్క్‌కు తరలింపు
![](https://imgd.ap7am.com/thumbnail/tn-bd56441182d3.jpg)
- నల్గొండ జిల్లాలో ఘటన
- అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు వల
- మత్తుమందు ఇచ్చి జూకు తరలింపు
నల్గొండ జిల్లా అజలాపురం వలసగుట్టలో ఓ రైతు ఏర్పాటు చేసిన వలలో చిరుతపులి చిక్కుకుపోయింది. అడవి పందులు పంటను ధ్వంసం చేస్తుండడంతో వాటి బారినుంచి పంటను కాపాడుకునేందుకు ధర్మానాయక్ అనే రైతు తన పొలం చుట్టూ వల ఏర్పాటు చేశాడు. నిన్న తెల్లవారుజామున పొలంలోని నీళ్లు తాగేందుకు వచ్చిన చిరుతపులి ఆ వలలో చిక్కుకుంది. ఉదయం పొలం వద్దకు వచ్చిన రైతు చిరుతను చూసి వెంటనే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. పొలం వద్దకు చేరుకున్న అటవీ అధికారులు చిరుతకు మత్తుమందు ఇచ్చి హైదరాబాద్ జూపార్క్‌కు తరలించారు.