Nara Lokesh: నేను మిస్డ్ కాల్ ఇచ్చాను.. మరి మీరు?: నారా లోకేశ్

  • అమరావతిని కాపాడుకుందాం
  • త్యాగం చేసిన రైతులకు భరోసాగా నిలుద్దాం
  • 8460708090 నంబర్ కు ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి

సీఎం జగన్ ను ‘తుగ్లక్’గా అభివర్ణిస్తూ టీడీపీ నేత నారా లోకేశ్ మరోమారు విమర్శలు చేశారు. జగన్ తుగ్లక్ నిర్ణయాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగస్వామ్యం కావాలంటూ ప్రజలకు పిలుపు నిచ్చారు. అమరావతిని కాపాడుకుందామని, రాజధాని కోసం త్యాగం చేసిన రైతులకు భరోసాగా నిలిచేందుకు 8460708090 ఫోన్ నంబర్ కు ఒక్క మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. ‘నేను మిస్డ్ కాల్ ఇచ్చి జై అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపాను. మరి మీరు?’ అంటూ లోకేశ్ ఓ ట్వీట్ చేశారు.  

Nara Lokesh
Jai Amaravathi
Missed call
Jagan
  • Loading...

More Telugu News