SarileruNeekevvaru: దర్శకుడు అనిల్ రావిపూడి భవిష్యత్ గురించి చెప్పిన మహేశ్ బాబు

  • సరిలేరు నీకెవ్వరు ఘనవిజయంతో పొంగిపోతున్న మహేశ్ బాబు
  • అభిమానులతో ట్విట్టర్ లో లైవ్ చాట్
  • అనిల్ రావిపూడి గురించి అడిగిన అభిమాని

'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ఘనవిజయంతో హీరో మహేశ్ బాబు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. ఈ ఊపులో ఆయన తన అభిమానులతో ట్విట్టర్ లో లైవ్ చిట్ చాట్ నిర్వహించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సమాధానాలిచ్చారు. ఓ అభిమాని దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ఒక్కమాటలో చెప్పాలని కోరారు. దీనికి మహేశ్ బాబు స్పందిస్తూ, అనిల్ రావిపూడిలో అపారమైన ఎనర్జీ ఉంటుందని కొనియాడారు. అమోఘమైన ప్రతిభ అనిల్ రావిపూడి సొంతమని, వచ్చే దశాబ్దం అతడిదేనని అన్నారు. దర్శకుడిగా తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తాడని జోస్యం చెప్పారు.

తాను చాలామంది దర్శకులతో పనిచేసినా సరిలేరు నీకెవ్వరు చిత్రం కోసం అనిల్ తో పనిచేయడం కొత్త అనుభూతినిచ్చిందని మహేశ్ బాబు వెల్లడించారు. సెట్స్ పై నవ్వుతూ, నవ్విస్తూ ఆహ్లాదంగా ఉంటాడని, అదే సమయంలో చిత్ర యూనిట్ మొత్తం తన నియంత్రణలో ఉండేలా చూసుకుంటాడని వివరించారు.

SarileruNeekevvaru
Mahesh Babu
Anil Ravipudi
Tollywood
Twitter
Live
  • Loading...

More Telugu News