Budda Venkanna: జగన్ మాత్రం అది అమలు చేయాల్సిందేనని బల్ల విరగ్గొట్టి చెబుతున్నారట!: బుద్ధా వెంకన్న

  • ‘మూడు రాజధానులు’పై మేధావులు సైతం తలకొట్టుకుంటున్నారు
  • ఇదో చెత్త నిర్ణయం
  • దీనిని సమర్థించాలంటూ ‘ఊరూరా వైసీపీ బ్యాండ్’

మూడు రాజధానుల అంశంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోమారు స్పందించారు. సీఎం జగన్ పై సెటైర్లు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై ఆరోపణలు చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. మూడు రాజధానులు ఏంటంటూ మేధావులు సైతం తలకొట్టుకుంటే, జగన్ మాత్రం అది అమలు చేయాల్సిందే అని బల్ల విరగ్గొట్టి చెబుతున్నారట అంటూ సెటైర్లు విసిరారు. ఈ చెత్త నిర్ణయాన్ని సమర్థించమంటూ ‘ఊరూరా వైసీపీ బ్యాండ్’ ని రంగంలోకి దింపి ర్యాలీలు చేయిస్తున్నారని, మరో పక్క విశాఖలో భూములు చక్కబెట్టి వాటాలు పంచే బిజీలో విజయసాయిరెడ్డి ఉన్నారని ఆరోపించారు.

Budda Venkanna
mlc
Telugudesam
YSRCP
cm
Jagan
mp
Vijayasaireddy
Amaravati
  • Error fetching data: Network response was not ok

More Telugu News