Pawan Kalyan: ఈ నెల 16న విజయవాడలో జనసేన-బీజేపీ కీలక సమావేశం: నాదెండ్ల మనోహర్

  • 16వ తేదీ ఉదయం పదకొండు గంటలకు సమావేశం
  • అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తాం
  • గాయపడ్డ జనసైనికుల్లో ధైర్యాన్ని నింపాం

జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో ‘జనసేన’ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విజయవాడలో ఈ నెల 16న పదకొండు గంటలకు జనసేన, బీజేపీల కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సమావేశం తర్వాత మీడియా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. గాయపడ్డ జన సైనికులకు, మహిళలకు ధైర్యాన్ని ఇచ్చేందుకే పవన్ కల్యాణ్, తమ పార్టీ నేతలు కాకినాడలో పర్యటించినట్టు చెప్పారు. శాంతియుతంగా, రాజకీయంగా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి నిచ్చేలా పని చేయాలి తప్ప, స్వార్థరాజకీయాలతో పనిచేయకూడదని సూచించారు.

Pawan Kalyan
janasena
Nadendla Manohar
BJP
  • Loading...

More Telugu News