Andhra Pradesh: రాజధానిని తరలిస్తే రైతులకు లక్షా 89 వేల 117 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది: సుజనా చౌదరి

  • సీఎం జగన్ కు సుజనా లేఖ
  • రాజకీయాలను పక్కనబెట్టి నిర్ణయం తీసుకోవాలని హితవు
  • అమరావతికి లక్ష కోట్లు ఖర్చవుతుందనడంలో నిజంలేదని వెల్లడి

రాజధాని మార్పు అంశంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఏపీ సీఎం వైఎస్ జగన్ కు లేఖ రాశారు. మూడు రాజధానుల అంశం ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం చేస్తున్న వాదనలో వాస్తవం లేదని తెలిపారు.

రాజధానిని తరలించేట్టయితే రైతులకు అత్యంత భారీ స్థాయిలో లక్షా 89 వేల 117 కోట్ల రూపాయల మేర నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. రాజధాని తరలింపు ఇటు ఆర్థికంగా, అటు న్యాయపరంగా అనేక దుష్పఫలితాలను ఇస్తుందని వెల్లడించారు. అందుకే రాజకీయాలను పట్టించుకోకుండా భవిష్యత్ తరాల పట్ల శ్రద్ధ వహించి నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు.

Andhra Pradesh
Amaravati
Jagan
YSRCP
Sujana Chowdary
BJP
  • Loading...

More Telugu News