TMC: ‘మమత’ దెయ్యాల నాయకురాలు: యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ విమర్శ

  • వేలాది మంది హిందువులను చంపిన దుర్మార్గులను రక్షిస్తున్నారు
  • ఆమెలో మానవత్వం, మహిళల కుండాల్సిన లక్షణాలు లేవు 
  • బీజేపీ దేవతల పార్టీ..
  • ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ రాక్షస జాతికి చెందినవి  

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని ‘లంకిణి’, దెయ్యాల నాయకురాలిగా అభివర్ణించి యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంచలనం రేపారు. పౌరసత్వ సవరణ చట్టం-2019పై మీడియా ప్రతినిధులతో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ‘మమత బెనర్జీకి సంపూర్ణమైన భూతం లక్షణాలున్నాయి. ఆమెలో మావనవత్వ విలువలు, మహిళలకు ఉండాల్సిన లక్షణాలు లోపించాయి. వేలాది మంది హిందువులను పొట్టనపెట్టుకున్న దుర్మార్గులను దీదీ రక్షిస్తున్నారు. ఇలాంటి నేతలను మనం దెయ్యాలుగా పిలుస్తుంటాం. ఆమె శ్రీలంకలోని రాక్షసి లంకిణి లక్షణాలను కలిగివుంది’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ దేవతల పార్టీ అంటూ.. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ రాక్షస జాతికి చెందినవని ధ్వజమెత్తారు.

TMC
Mamata Benerjee
BJP
MLA Surendra singh
West Bengal
  • Loading...

More Telugu News