Crime News: కొన్నేళ్ల క్రితం కోడల్ని చంపి.. ఇప్పుడు భర్తను చంపిన మహిళ!

  • మెదక్‌ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో ఘటన
  • కుటుంబ కలహాలే కారణం
  • అప్పట్లో కోడల్ని చంపి జైలుకి వెళ్లొచ్చిన నిందితురాలు

సొంత కుటుంబ సభ్యులపైనే దాడి చేసి చంపేసింది ఓ మహిళ. కొన్నేళ్ల క్రితం కోడల్ని చంపిన ఆమె... ఇప్పుడు తన భర్తను హత్య చేసింది. మెదక్‌ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఇబ్రహీంపూర్‌కి చెందిన సత్తమ్మ కుటుంబ కలహాల కారణంగా తన భర్త భిక్షపతిని గొడ్డలితో నరికి హత్య చేసింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సత్తమ్మను అరెస్టు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కొన్నేళ్ల క్రితం కోడల్ని చంపిన కేసులో సత్తమ్మ జైలుకు వెళ్లి వచ్చిందని పోలీసులు వివరించారు.

Crime News
Telangana
Medak District
  • Loading...

More Telugu News