NTR Stadium: సంక్రాంతి సంబరాల్లో 'జై అమరావతి' నినాదాలు... సర్ది చెప్పలేక పోలీసుల తంటాలు!

  • ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు
  • కలెక్టర్ ముందు వాకర్స్ అసోసియేషన్ నినాదాలు
  • సంబరాల్లో పెద్దఎత్తున పాల్గొన్న ప్రజలు

గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా జరుగుతున్న వేళ, పాల్గొనేందుకు వచ్చిన కలెక్టర్ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ కొంత ఇబ్బంది పడ్డారు. నిత్యమూ స్టేడియానికి వచ్చే వాకర్స్ అసోసియేషన్ సభ్యులు 'జై అమరావతి', 'సేవ్ అమరావతి' అంటూ నినాదాలు చేశారు. నినాదాలు వద్దని వాకర్స్ కు సర్దిచెప్పలేక పోలీసులు తంటాలు పడ్డారు. కలెక్టర్ అక్కడ ఉన్నంత సేపూ ఈ నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ వేడుకల్లో కలెక్టర్ తో పాటు, మునిసిపల్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

NTR Stadium
Guntur
Collector
Save Amaravati
  • Loading...

More Telugu News