Talasani: భీమవరంలో సంక్రాంతి జరుపుకోనున్న తెలంగాణ మంత్రి తలసాని

  • నేడు భీమవరంలో భోగి వేడుకలు
  • రేపు సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న మంత్రి
  • కోడి పందాల్లోనూ పాల్గొననున్న తలసాని

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ అగ్రనేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది ఆయన ఏపీలో జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా అలవాటుగా వస్తున్న దీనిని ఈసారి కూడా కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా నేడు భీమవరంలో జరిగే భోగి వేడుకల్లో, రేపు సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. అలాగే, కోడి పందాల్లోనూ ఆయన సరదాగా పాల్గొంటారని ఆయన అనుచరులు తెలిపారు. మంత్రి రాక సందర్భంగా భీమవరంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Talasani
Andhra Pradesh
Telangana
Sankranti
  • Loading...

More Telugu News