BJP: బీజేపీ చీఫ్‌గా 22న నడ్డా బాధ్యతల స్వీకరణ.. ఏపీ, తెలంగాణ రేసులో దిగ్గజాలు!

  • అంతకంటే ముందు ఏపీ, తెలంగాణ అధ్యక్షులు నియామకం 
  • ఏపీ రేసులో కన్నా, పురంధేశ్వరి, మాణిక్యాలరావు, మాధవ్
  • తెలంగాణ రేసులో లక్ష్మణ్, చింతల, జితేందర్, డీకే అరుణ

ప్రస్తుతం బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా ఈ నెల 22న అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకంటే ముందు ఏపీ, తెలంగాణ సహా రాష్ట్ర అధ్యక్షుల నియామకాలు కూడా పూర్తిచేయాలని పార్టీ భావిస్తోంది. ఏపీ అధ్యక్ష పదవి రేసులో ప్రస్తుత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరు మరోమారు వినిపిస్తుండగా పురంధేశ్వరి, మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ మాధవ్‌లు కూడా రేసులో ఉన్నారు.

తెలంగాణలో ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, జితేందర్‌రెడ్డి, డీకే అరుణ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నట్టు రెండు రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే, ఆ పదవి చేపట్టేందుకు ఆయన విముఖత ప్రదర్శించినట్టు తెలుస్తోంది. మరోవైపు, ప్రాంతాల మధ్య సమతౌల్యం పాటించే ఉద్దేశంతో కార్యనిర్వాహక అధ్యక్షుడిని కూడా నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

BJP
JP Nadda
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News