Raghuram Rajan: ఆర్థిక లోటు భర్తీకి మోదీ ప్రభుత్వం ఇంకా చాలా దూరంలో ఉంది: రఘురాం రాజన్

  • మరెన్నో సంస్కరణలు చేపట్టాల్సి ఉందన్న ఆర్బీఐ మాజీ గవర్నర్
  • ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో సాగుతోందని ఆందోళన
  • పెట్టుబడులకు గణాంకాలు అనుకూలంగా లేవని వ్యాఖ్యలు

గత ఐదేళ్లలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో సాగుతోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థూల ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు, ఆర్థికలోటు భర్తీకి మోదీ ప్రభుత్వం చాలా దూరంలో నిలిచిందని అన్నారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలంటే మరెన్నో సంస్కరణలు చేపట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

 దేశంలో తీవ్రస్థాయిలో నిరుద్యోగం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడున్న వృద్ధి రేటు ఏమాత్రం సమస్యను పరిష్కరింపజాలదని తెలిపారు. మరోవైపు పెట్టుబడులు ఆకర్షించాలన్నా గానీ ఆర్థిక గణాంకాలు అనుకూలంగా లేవని విశ్లేషించారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రఘురాం రాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Raghuram Rajan
India
Economy
RBI
Narendra Modi
BJP
  • Loading...

More Telugu News