Uttam Kumar Reddy: సంక్రాంతి శోభ పల్లెల్లో వెల్లివిరియాలి: టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్

  • తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
  • పండగలను సంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలి
  • నిధుల విడుదలలో ప్రభుత్వం విఫలమైందన్న ఉత్తమ్  

సంక్రాంతి శోభ పల్లెల్లో వెల్లివిరియాలని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండగలను సంప్రదాయ పద్ధతిలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా, త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో విఫలమైందని ఆరోపించారు. మున్సిపాలిటీల్లో రహదారుల పరిస్థితి దారుణంగా ఉందని, టీఆర్ఎస్ ను ప్రజలు ‘ఛీ’ కొడుతున్నారని విమర్శించారు.

Uttam Kumar Reddy
Telangana
pcc
Sankranthi
  • Loading...

More Telugu News