Jagan: ఒకే రంగు దుస్తుల్లో సీఎం జగన్, కేటీఆర్.... ప్రగతి భవన్ లో ఆసక్తికర దృశ్యం

  • హైదరాబాద్ వెళ్లిన సీఎం జగన్
  • తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ
  • జగన్ కు ఎదురేగి స్వాగతం పలికిన కేటీఆర్

ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లిన సంగతి విదితమే. జగన్, కేసీఆర్ ప్రగతిభవన్ లో భేటీ అయ్యారు. అయితే, ప్రగతిభవన్ కు జగన్ వెళ్లినప్పుడు సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ ఎదురేగి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది.

సీఎం జగన్, మంత్రి కేటీఆర్ ఇద్దరూ ఒకే తరహా దుస్తులు ధరించి పక్కపక్కనే నడుస్తుండగా కెమెరాలు ఒక్కసారిగా క్లిక్ మన్నాయి. ఒకే రంగు షర్టు, ఒకే రంగు ప్యాంటు ధరించిన వీరిరువురు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అంతేకాదు, ప్రగతిభవన్ కు వచ్చిన జగన్ ను అక్కడే ఉన్న కేటీఆర్ తనయుడు హిమాన్షు విష్ చేయడమే కాకుండా కరచాలనం కూడా చేశారు.

Jagan
KTR
Hyderabad
KCR
Andhra Pradesh
Telangana
Pragathi Bhavan
  • Loading...

More Telugu News