Rayapati Sambasiva Rao: చంద్రబాబు, మోదీ, పవన్ ముగ్గురూ కలుస్తారు: రాయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు

  • మందడం వచ్చిన మాజీ ఎంపీ రాయపాటి
  • రైతులకు సంఘీభావం
  • మోదీతో విభేదించడం చంద్రబాబు తప్పేనన్న రాయపాటి

గతంలో నరేంద్ర మోదీకి దూరం జరగడం చంద్రబాబు తప్పేనని టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. మందడంలో రైతుల దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన రాయపాటి మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు హయాంలో కొన్ని తప్పులు జరిగాయని, ఆ సమయంలో చంద్రబాబు మోదీని విభేదించకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అయితే, అది తాత్కాలికమేనని, వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్ ఒక్కటవుతారని జోస్యం చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని అన్నారు. కాగా, రాయపాటి ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలోనే, కలిసి పనిచేయాలని బీజేపీ, జనసేన పార్టీలు నిర్ణయించుకున్నట్టు వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Rayapati Sambasiva Rao
Chandrababu
Pawan Kalyan
Narendra Modi
BJP
Telugudesam
Jana Sena
  • Loading...

More Telugu News