Medaram: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరపై మంత్రి సత్యవతి సమీక్ష... భక్తులకు బంగారం ఇవ్వాలని యోచన

  • ఫిబ్రవరిలో మేడారం జాతర
  • మేడారంలో జరుగుతున్న ఏర్పాట్లు
  • లోపాలుంటే బాధ్యులపై చర్య తీసుకుంటామన్న మంత్రి

తెలంగాణలో నిర్వహించే మేడారం జాతర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమ్మక్క-సారలమ్మ తిరునాళ్లగా ఎంతో ప్రసిద్ధికెక్కిన ఈ వేడుకకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఫిబ్రవరిలో మేడారం జాతర జరగనున్న నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

జంపన్నవాగు ఇసుక లెవెల్ మెయింటైన్ చేయడానికి జరుగుతున్న పనులను పరిశీలించామని, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుపై ప్రధానంగా దృష్టి పెట్టామని వివరించారు. పనులు పూర్తయిన తర్వాత లోపాలు కనిపిస్తే బాధ్యులపై చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. పోలీసులు సైతం ఇక్కడి ఏర్పాట్లను సమీక్షిస్తుండాలని, జాతరకు వచ్చే భక్తులను ఇబ్బందిపెట్టే విధంగా అటవీశాఖ అధికారులు వ్యవహరించరాదని తెలిపారు. అంతేగాకుండా, భక్తులకు బంగారం ఇచ్చే సంప్రదాయాన్ని ప్రారంభించాలని దేవాదాయ శాఖ తలపోస్తోందని వెల్లడించారు.

Medaram
Sammakka-Saralamma
Jatara
Telangana
Festival
Gold
Sathyavathi Rathod
  • Loading...

More Telugu News