Raviteja: 'డిస్కోరాజా' నుంచి మరో టీజర్ రిలీజ్

  • 'డిస్కోరాజా'గా డిఫరెంట్ లుక్ తో రవితేజ
  • కథానాయికలుగా ముగ్గురు ముద్దుగుమ్మలు 
  • 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు

విభిన్నమైన కథలను ఎంచుకుని వాటిని తనదైన స్టైల్ లో తెరపై ఆవిష్కరించడం దర్శకుడు వీఐ ఆనంద్ ప్రత్యేకత. తన తాజా చిత్రంగా ఆయన 'డిస్కోరాజా' సినిమాను రూపొందించాడు. నభా నటేశ్ .. పాయల్ .. తాన్యా హోప్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు. "సోల్జర్స్ సంవత్సరాల పాటు బాంబింగ్స్ తోను .. ఫైరింగ్స్ తోను యుద్ధాలు చేసి, రిటైరై ఇంట్లో వుంటే సడన్ గా వచ్చే సైలెన్స్ ఉంటది చూడు, అది అప్పటిదాకా వాళ్లు చూసిన వయొలెన్స్ కంటే కూడా భయంకరంగా వుంటది" అనే వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలవుతోంది. హీరో .. విలన్ కాంబినేషన్స్ లోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకునేలా వుంది.

Raviteja
Nabha
Payal
Thanya
  • Error fetching data: Network response was not ok

More Telugu News