Chandrababu: దీనికోసమేనా ఒక్క చాన్స్ అని అడిగింది?... జనసైనికులపై వైసీపీ కార్యకర్తల దాడిని ఖండించిన చంద్రబాబు

  • కాకినాడలో జనసేన కార్యకర్తలపై దాడి
  • విరుచుకుపడిన వైసీపీ కార్యకర్తలు
  • స్పందించిన చంద్రబాబు

అధికారాన్ని అడ్డంపెట్టుకుని మీరు ఆడే వికృత క్రీడ ఎన్నో రోజులు సాగదంటూ సీఎం జగన్ ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. కాకినాడలో జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడడం పట్ల చంద్రబాబు స్పందించారు. కాకినాడలో నిన్న జరిగిన హింస, దౌర్జన్యాలను ఖండిస్తున్నట్టు తెలిపారు. మహిళలని కూడా చూడకుండా పోలీసుల సమక్షంలోనే వారిపై దాడి చేయడం, రోడ్ల మీద వీరంగం వేయడం, ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేయడం రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శనం అని చంద్రబాబు పేర్కొన్నారు. ఒక్క చాన్స్ ఇవ్వమని ప్రజలను అడిగింది దీనికోసమేనా జగన్ మోహన్ రెడ్డిగారూ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu
Andhra Pradesh
Jana Sena
Kakinada
YSRCP
Jagan
Telugudesam
  • Loading...

More Telugu News