dadiveerabhadrarao: మూడు రాజధానులపై చంద్రబాబు విషప్రచారం: మాజీ మంత్రి దాడి వీరభద్రరావు

  • ఆయన పదవి లేకుండా ఉండలేరని అర్థమవుతోంది 
  • విశాఖ రాజధానికి అనుకూలమైన ప్రాంతం
  • హైపవర్ కమిటీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు దాడి వీరభద్రరావు విమర్శించారు. ప్రస్తుతం చంద్రబాబు వ్యవహార శైలి చూస్తుంటే అధికారం లేకుండా ఆయన ఒక్క క్షణం కూడా ఉండలేరని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

 వైసీపీ విశాఖ నగర పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజధానిగా విశాఖ అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతమని, ఈ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు.

రాజధానిగా విశాఖ అవుతుందా? లేదా? అన్న విషయాన్ని తాను చెప్పలేనని, హైపవర్ కమిటీ భేటీ తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని చంద్రబాబు కోరుకోవడం లేదన్నారు. ఎన్టీఆర్ కుమార్తెలు కూడా విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తుండడం ఆశ్చర్యమని, ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎవరూ అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News