AP 24X7: ఆ ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ను నీ సరసాలకు వాడుకో!: పృథ్వీరాజ్ కు 'ఏపీ 24/7' టీవీ చానెల్ సీఈఓ వెంకటకృష్ణ ఆఫర్

  • వెంకటకృష్ణపై విమర్శలు చేసిన పృథ్వీరాజ్
  • తీవ్రంగా మండిపడిన వెంకట కృష్ణ 
  • పృధ్వీ బత్తాయి పండి, రాలిందని సెటైర్లు

తనకు అమరావతి పరిధిలోని వైకుంఠపురంలో తొమ్మిది ఎకరాల పొలం ఉందని, టీడీపీ నేతలు తనకు త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ను ఇచ్చారని ఆరోపించిన నటుడు పృథ్వీరాజ్ పై 'ఏపీ 24/7' టీవీ చానెల్ సీఈఓ వెంకటకృష్ణ, తీవ్రంగా మండిపడ్డారు.

అసలు వైకుంఠపురం అనే గ్రామం ఎక్కడ ఉందో కూడా తనకు తెలియదని, తనకు భూమి ఉన్నట్టు నిరూపించి, ఆ భూమిని పృథ్వీరాజ్, తనకు నచ్చిన అనాధ శరణాలయానికి దానం ఇచ్చుకోవచ్చని సవాల్ విసిరారు. తనకు టీడీపీ నేతలు ఇచ్చారని చెబుతున్న మూడు బెడ్ రూముల ఇంటిని ఆయన తన సరస సల్లాపాలకు వాడుకోవచ్చని సెటైర్లు వేశారు. మూడు బెడ్ రూముల్లో ముగ్గురిని ఉంచుకుని వాడుకోవచ్చని అన్నారు.

ప్రజల తరఫున ఓ గొంతుకగా ఉండాలన్న ఉద్దేశంతో తాను విజయవాడకు వచ్చానని, ఎన్నికలకు ముందు తాను టీడీపీకి అనుకూలంగా లేనని చెబుతూ, తమ చానెల్ కు యాడ్స్ ఇవ్వడాన్ని కూడా ఆపేశారని వెంకటకృష్ణ చెప్పారు. పృథ్వీ రాజీనామాకు, తనకు ఎటువంటి సంబంధం లేదని, తనకు వచ్చిన డాక్యుమెంట్లను మీడియా ముందుకు తీసుకుని వెళ్లడమే తన కర్తవ్యమని చెప్పారు. తాను ఓ స్టోరీని ఫైల్ చేసే సమయంలోనే, పృథ్వీ బత్తాయి పండి, రాలిపోయిందని ఎద్దేవా చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News