Nagababu: వైసీపీ గూండాలు చేసిన దాడులకు మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి: నాగబాబు ఫైర్

  • పోలీసులు ఏక పక్షంగా ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం
  • పార్టీలు అధికారంలో ఈ రోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు 
  • ద్వారంపూడి అగ్రకుల దురహంకారం దెబ్బతినే రోజు త్వరలో వస్తుంది 

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని భానుగుడి సెంటర్‌లో జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంపై జనసేన నేత నాగబాబు మండిపడ్డారు. 'తప్పుడు మాటలు మాట్లాడిన వాడిని క్షమాపణ చెప్పమని అడగడానికి శాంతియుతంగా వెళ్లిన జనసైనికులని జనసేన మహిళ కార్యకర్తలను రాళ్లతో కొట్టించిన చంద్రశేఖర్ రెడ్డి కిరాయి గూండాలకి ఎదురు తిరిగి డేరింగ్‌గా పోరాడిన జనసేన మహిళ కార్యకర్తలకి నా హృదయ పూర్వక అభినందనలు' అని ట్వీట్ చేశారు.
 
'వైసీపీ గూండాలు చేసిన దాడుల సాక్ష్యాలు మా దగ్గర కూడా ఉన్నాయి. కానీ, పోలీస్ ఏకపక్షంగా ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. పార్టీలు అధికారంలో ఈ రోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు. కానీ ప్రజలను, న్యాయాన్ని రక్షించాల్సిన పోలీస్ ఇలా అధికారపక్షం వాళ్ల దుర్మార్గాన్ని రక్షించాలనుకోవటం ఎంతవరకు కరెక్ట్?' అని ప్రశ్నించారు.
 
'ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అగ్రకుల దురహంకారం దెబ్బతినే రోజు త్వరలో వస్తుంది. తప్పు చేసిన వాళ్లని వదిలేసి శాంతియుతంగా అడగడానికి వెళ్లిన మా జనసైనికుల మీద కేసులు పెట్టడం చాలా అన్యాయం. ఇప్పటికయినా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ తప్పుని సరిదిద్దుకోండి. వాళ్లు చేసిన దాడుల సాక్షాలు ఒక్కసారి చూడండి' అని ట్వీట్లు చేశారు.
 
'ఈ సంఘటనలో సాహసంతో పోరాడిన సందీప్ పంచకర్ల, నానాజీ, రాజబాబులకి మరీ ముఖ్యంగా వీర మహిళలు అయిన ప్రియ సౌజన్య, గంటా స్వరూప, మానస, శేషుకుమారి, సరోజ, మరియు మిగిలిన వీరమహిళలందరికీ నా మనఃపూర్వక మద్దతు తెలియజేస్తున్నాను. త్వరలో  కాకినాడ వచ్చి మీ అందరినీ కలుస్తాను' అని ట్వీట్ చేశారు

Nagababu
Jana Sena
Andhra Pradesh
  • Loading...

More Telugu News