varla ramaiah: ముఖ్యమంత్రి గారు.. ఏమిటి ఈ అన్యాయం?: వర్ల రామయ్య

  • ముఖ్యమంత్రి గారు.. మీ పాలన ఘోరంగా ఉంది
  • మీరే మరో ఉద్యమాన్ని సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తారా?
  • మీ పార్టీ వారితో ఊరేగింపులు చేయిస్తారా?
  • హిట్లర్ పాలనకంటే ఘోరం 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. 'ముఖ్యమంత్రి గారు.. మీ పాలన ఘోరంగా ఉంది. అమరావతి ఉద్యమాన్ని అణచడం కోసం మీరే మరో ఉద్యమాన్ని సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తారా? మీ పార్టీ వారితో ఊరేగింపులు చేయిస్తారా? హిట్లర్ పాలనకంటే ఘోరంగా వుందే. ప్రజాస్వామ్యమంటే విశ్వాసం లేదా మీకు? ప్రజల మధ్య మీరే వైషమ్యం సృష్టిస్తారా?' అని నిలదీశారు.

'ముఖ్యమంత్రి గారు.. ఏమిటీ ఈ అన్యాయం? ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎలా ర్యాలీ తీస్తారు?  రెండు వర్గాలు తన్నుకు చావండి అని ముఖ్యమంత్రిగా మీరే ప్రేరేపిస్తారా? ఎటు పోతుంది సార్ మన పాలన? మీరే రాష్ట్ర ప్రజలను విభజించి పాలిస్తారా? బ్రిటిష్ పాలనను మించిపోతుంది మీ పాలన'అని వర్ల రామయ్య ట్వీట్ చేశారు.

కాగా, రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరిగి, సమగ్ర అభివృద్ధి జరగాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ రోజు ఉదయం గుంటూరు జిల్లా పెనుమాక నుంచి భారీ ర్యాలీ నిర్వహించాలని ప్రయత్నించగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

varla ramaiah
Telugudesam
  • Loading...

More Telugu News