America: ఇరాక్‌లోని ప్రభుత్వ వ్యతిరేకులను హెచ్చరించిన అమెరికా.. ఇరాన్ దాడిపై ఆగ్రహం
- దాడిని ఖండిస్తున్నామన్న మైక్ పాంపియో
- ప్రభుత్వ అవిధేయుల పనేనన్న అమెరికా మంత్రి
- వెంటనే స్వస్తి పలకాలని హెచ్చరిక
ఇరాక్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ జరిపిన తాజా దాడిపై అమెరికా మండిపడింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. ఇరాక్ ప్రభుత్వానికి అవిధేయులైన కొందరు ఆ దేశ సార్వభౌమత్వంపై దాడి చేస్తున్నారని, దీనికి స్వస్తి పలకాల్సిందేనంటూ పరోక్షంగా ఇరాక్‌లోని ప్రభుత్వ వ్యతిరేకులను హెచ్చరించారు. దాడి వెనక ఉన్న వారిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఇరాక్ ప్రభుత్వాన్ని కోరారు.
కాగా, ఇరాక్‌లోని అల్ బలాద్ వైమానిక స్థావరంపై నిన్న ఇరాన్ రాకెట్ దాడికి పాల్పడింది. 8 రాకెట్లు ఒక్కసారిగా వచ్చి స్థావరాన్ని తాకినట్టు ఇరాక్ పేర్కొంది. ఈ దాడిలో నలుగురు గాయపడ్డారు.