sriramagiri: శ్రీరామగిరి ఆలయంలో చోరీ... సమస్తం దొంగల పాలు!

  • శ్రీరామగిరి ఆలయంలో చోరీ
  • గుడి తలుపులు బద్దలు కొట్టిన దొంగలు
  • హుండీ, ఆభరణాలు చోరీ
  • కేసును విచారిస్తున్న పోలీసులు

తూర్పు గోదావరి జిల్లా వీఆర్ పురం మండలంలోని శ్రీరామగిరి రామాలయంలో భారీ చోరీ జరిగింది. గత అర్ధరాత్రి గుడి తలుపులను బద్దలు కొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు, సమస్తం దోచుకెళ్లారు. ఆలయంలోని హుండీని పగులగొట్టి, అందులో భక్తులు వేసిన కానుకలు, డబ్బుతో పాటు, అమ్మవారి నగలు, వెండి ఆభరణాలనూ ఎత్తుకెళ్లారు. ఈ ఉదయం గుడి తలుపులు తెరచిన పూజారి, దొంగతనం జరిగిందని గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆలయానికి చేరుకుని, దొంగతనం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు.

sriramagiri
East Godavari District
Temple
Theft
  • Loading...

More Telugu News