Kaira Advani: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • చరణ్ సరసన మరోసారి కైరా?
  • 'ఫైటర్' కోసం విజయ్ దేవరకొండకు శిక్షణ
  • అనంతపురంలో వెంకటేశ్ మకాం  

 *  బాలీవుడ్ భామ కైరా అద్వానీ మరోసారి రామ్ చరణ్ సరసన జోడీ కట్టే అవకాశం కనిపిస్తోంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తాడంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్ సరసన నాయికగా కైరా అద్వానీని ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమధ్య వీరిద్దరూ కలసి 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించిన సంగతి విదితమే.
*  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా 'ఫైటర్' పేరిట రూపొందే చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇది యాక్షన్ ప్రధానంగా సాగే కథ కావడంతో ప్రస్తుతం విజయ్ థాయిలాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నాడట. ఈ నెలాఖరులో ఈ చిత్రం షూటింగ్ ముంబైలో మొదలవుతుంది.
*  వెంకటేశ్ కథానాయకుడుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందే చిత్రం షూటింగ్ ఈ నెల 20  నుంచి అనంతపురం పరిసరాల్లో జరుగుతుంది. ఈ తొలి షెడ్యూలు షూటింగ్ కోసం నెల రోజుల పాటు వెంకటేశ్ అనంతపురం పట్టణంలో వుంటారు.    

Kaira Advani
Ramcharan
Vijay Devarakonda
Venkatesh
  • Loading...

More Telugu News