Greater Rayalaseema: గ్రేటర్ రాయలసీమకు కడపను రాజధానిగా కోరుకుంటా: జేసీ

  • రాష్ట్ర పరిస్థితులపై జేసీ వ్యాఖ్యలు
  • కడప అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉంటుందని వెల్లడి
  • జగన్ వి పిల్లచేష్టలంటూ విమర్శలు

​ఏపీలో తాజాగా నెలకొన్న పరిణామాలపై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. జగన్ పిల్ల చేష్టలతో రాజధాని మార్పు సంభవిస్తే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం రావడం ఖాయమని అన్నారు. అదే జరిగితే గ్రేటర్ రాయలసీమకు కడపను రాజధానిగా కోరుకుంటామని స్పష్టం చేశారు. కడప రాజధాని అయితే కర్నూలు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాలకు సమాన దూరంలో ఉంటుందని తెలిపారు. అమరావతి విషయంలో జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రెండు కులాల మధ్య రాజధాని చిచ్చుపెడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉండేది రెండు కులాలేనా అంటూ జేసీ ప్రశ్నించారు.

Greater Rayalaseema
Kadapa
JC Diwakar Reddy
Telugudesam
Andhra Pradesh
Amaravati
YSRCP
Jagan
  • Loading...

More Telugu News