Allu Arjun: బావా... నిన్ను త్వరలో కలుస్తా: ఎన్టీఆర్ ట్వీట్ కు బదులిచ్చిన బన్నీ

  • అల... వైకుంఠపురములో చిత్రానికి సూపర్ డూపర్ హిట్ టాక్
  • బన్నీకి అభినందనల వెల్లువ
  • కంగ్రాట్స్ బావా అంటూ విషెస్ చెప్పిన ఎన్టీఆర్
  • రిప్లయ్ ఇచ్చిన అల్లు అర్జున్

ఆదివారం రిలీజైన అల.. వైకుంఠపురములో చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దాదాపు రివ్యూలన్నీ డబుల్ పాజిటివ్ గా వచ్చాయి. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అల్లు అర్జున్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సైతం అల... వైకుంఠపురములో చిత్రానికి ఫిదా అయ్యారు. కంగ్రాట్స్ బావా అంటూ తన స్పందనను ఓ ట్వీట్ రూపంలో వెలిబుచ్చారు. దీనికి బన్నీ వెంటనే స్పందించారు. బావా... థాంక్యూ వెరీ మచ్. త్వరలోనే నిన్ను కలుస్తా. నీతో మాట్లాడుతుంటే ఎంతో బాగుంటుంది అంటూ ట్విట్టర్ లో రిప్లయ్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ కు, బన్నీ రిప్లయ్ కి లైకులు, రీట్వీట్లు భారీగా వస్తున్నాయి.

Allu Arjun
Jr NTR
Tarak
Ala Vaikunthapuramulo
Tollywood
Bunny
  • Loading...

More Telugu News