Allu Arjun: ఇప్పుడు నాకు ఏడుగురు మేనేజర్లు... అందుకే సపరేట్ ఆఫీస్ తీసుకున్నా: అల్లు అర్జున్

  • గతంలో గీతాఆర్ట్స్ లో చిన్న రూమ్ లో బన్నీ కార్యకలాపాలు
  • పెరిగిన మార్కెట్ నేపథ్యంలో ప్రత్యేకమైన ఆఫీస్
  • బన్నీ గీతాఆర్ట్స్ నుంచి బయటికి వచ్చేశాడని పుకార్లు

అల.. వైకుంఠపురములో చిత్రం రిలీజ్ కు ముందు హీరో అల్లు అర్జున్ ఓ మీడియా సంస్థకు సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో సొంత ప్రొడక్షన్ సంస్థ గీతాఆర్ట్స్ కార్యాలయంలోనే తనకు సొంత రూమ్ ఉండేదని తెలిపారు. అప్పట్లో  తన మేనేజర్ బన్నీ వాసుతో ఆ రూమ్ లోనే ఉండి తన సినిమా వర్క్ లన్నీ చేసుకునేవాడ్నని వివరించారు.

ఆ తర్వాత తన మార్కెట్ పెరగడంతో బయటి చిత్రాల పనులను కూడా గీతాఆర్ట్స్ కార్యాలయంలోనే నిర్వహంచుకోవడం సరికాదనిపించిందని, అందుకే బయట సొంతగా ఆఫీసు ప్రారంభించానని బన్నీ వెల్లడించారు. దానికితోడు ప్రస్తుతం తనకు ఏడుగురు మేనేజర్లు ఉన్నారని, వారందరితో ఒకే రూమ్ లో కార్యకలాపాలు సాగించడం కష్టమని భావించి ప్రత్యేకంగా ఆఫీసు ఉంటే బాగుంటుందని నిర్ణయించుకున్నామని చెప్పారు. అయితే, గీతా ఆర్ట్స్ నుంచి బన్నీ బయటికొచ్చేశాడని పుకార్లు వచ్చాయని వివరించారు.

Allu Arjun
Geetha Arts
Tollywood
Office
Bunny Vasu
  • Loading...

More Telugu News