Chandrababu: నరసరావుపేటలో అనుమతి లేదంటూ ర్యాలీని ఆపేందుకు పోలీసుల యత్నం.. ప్రతిఘటించిన చంద్రబాబు

  • కొనసాగుతున్న సేవ్ అమరావతి ఉద్యమం
  • నరసరావుపేట వెళ్లిన చంద్రబాబు
  • అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సేవ్ అమరావతి ఉద్యమంలో భాగంగా గుంటూరు జిల్లా నరసరావుపేట వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, రాజధాని ఉద్యమ ర్యాలీకి పోలీసులు అభ్యంతరం చెప్పారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించగా, చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. యువకుల నుంచి బైక్ తాళాలను లాగేసుకున్నారు.

కానీ చంద్రబాబు పోలీసుల అభ్యంతరాలను లెక్కచేయకుండా ముందుకు సాగేందుకు ప్రయత్నించారు. వైసీపీ నేతల ర్యాలీలకు ఎలా అనుమతిస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే చంద్రబాబు గట్టిగా నిలదీయడంతో పోలీసులు యువకుల బైక్ తాళాలను తిరిగి ఇచ్చేశారు. చంద్రబాబు స్పందిస్తూ, డీజీపీ గౌతమ్ సవాంగ్ చట్టవ్యతిరేక చర్యలను విడనాడాలని స్పష్టం చేశారు.

Chandrababu
Narasaraopet
Guntur District
Andhra Pradesh
Amaravati
  • Loading...

More Telugu News