TTD: పృథ్వీరాజ్ పై ఆరోపణల గురించి తెలియగానే ఆయనతో మాట్లాడాను: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

  • తన తప్పేమీ లేదని పృథ్వీ చెప్పాడు
  • తనను అవమానించేందుకే ఈ ఆరోపణలు అన్నాడు
  • వాస్తవాలు తెలుసుకోకుండా ఎలాంటి చర్యలు చేపడతాము

ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ పై ఆరోపణలు తలెత్తిన విషయం తెలిసిందే. పృథ్వీ ఆడియో టేపుల వ్యవహారం గురించి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మీడియా ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ, ఈ విషయం గురించి తెలిసిన వెంటనే పృథ్వీతో మాట్లాడానని చెప్పారు.

ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని, తనను అవమానించేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని, తన గొంతును ఎవరో అనుకరించినట్టు ఆ వీడియోలో తెలుస్తోందని పృథ్వీ తనతో చెప్పాడని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎలాంటి చర్యలు చేపడతామని ప్రశ్నించారు. దీనిపై విచారణకు విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించానని, నివేదిక అందిన తర్వాత సీఎంకు తెలియజేస్తామని అన్నారు. కాగా, పృథ్వీ వ్యవహారం గురించి ఇప్పటికే జగన్ కు తెలిసిందని, ఆయనపై చర్యలు తప్పవని సమాచారం.

TTD
chairman
YV Subba Reddy
Prudhvi Raj
Svbc
  • Loading...

More Telugu News